‘రాజా సాబ్’లో ప్రభాస్ తో మాస్ సాంగ్.. లీక్ చేసిన బ్యూటీ!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో టీజర్ తో ఊహించని ట్రీట్ ఇచ్చిన చిత్రమే “ది రాజా సాబ్”. దర్శకుడు మారుతీ ఇచ్చిన ఊహించని ట్రీట్ తో డార్లింగ్ ఫ్యాన్స్ లో మరింత కాన్ఫిడెన్స్ ఇప్పుడు వచ్చింది. ఇక ఈ సినిమా శరవేగంగా కంప్లీట్ అవుతూ ఇప్పుడు ఆఖరి దశకి వచ్చేస్తుంది.

మరి ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్స్ ఉన్న సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ అలాగే మాళవిక మోహనన్ లు ఉన్నారు. మరి వీరిలో ఓ బ్యూటీ ప్రభాస్ తో క్రేజీ మాస్ సాంగ్ చేసినట్టుగా కన్ఫర్మ్ చేసింది. మరి ఆమె ఎవరో కాదు ఈ సినిమా తోనే తెలుగు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మాళవిక మోహనన్.

లేటెస్ట్ గా సోషల్ మీడియా ఇంట్రాక్షన్ లో ఈ విషయాన్ని లీక్ చేసింది. సో థమన్ మ్యూజికల్ బీట్స్ లో డార్లింగ్ తో ఒక క్రేజీ మాస్ సాంగ్ ని విట్నెస్ చెయ్యొచ్చని చెప్పాలి. ఇక భారీ బడ్జెట్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ సినిమాని నిర్మాణం వహిస్తుండగా ఈ డిసెంబర్ 5న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

Exit mobile version