మరో యువనటుడి ఆత్యహత్య

బాలీవుడ్ లో విషాదాల పరంపర కొనసాగుతుంది. మరో యువ నటుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. టీవీ నటుడిగా ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న సమీర్ శర్మ తన నివాసంలో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. సమీర్ ముంబైలోని మలాడ్ ప్రాంతంలో గల తన నివాసంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆయన ఇంటి నుండి బయటకు రాకపోవడంతో అనుమానంతో డోర్ తెరిచి చూడగా కిచెన్ లో సీలింగ్ కి వేలాడుతూ కనిపించాడు. ఈ ఘటన జరిగి రెండు రోజులు అవుతున్నట్లుగా తెలుస్తుంది.

సమీర్ శర్మ మరణానికి బాలీవుడ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఘటన మరవక ముందే ఇలాంటి మరో విషాదకర సంఘటన కలచివేసింది. 44 ఏళ్ల సమీర్ శర్మ డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఆయన మరణానికి ముందు ఇంస్టాగ్రామ్ లో ఓ డిస్టర్బ్ పోస్ట్ పెట్టారు. సమీర్ జ్యోతి, కహానీ ఘర్ ఘర్ కి, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అనే సీరియల్స్ ఆయన నటించారు.

Exit mobile version