జూలై 20న విడుదల కానున్న “తూనీగ తూనీగ”

జూలై 20న విడుదల కానున్న “తూనీగ తూనీగ”

Published on Jul 11, 2012 12:33 AM IST


తాజా సమాచారం ప్రకారం ఎం ఎస్ రాజు రాబోతున్న చిత్రం “తూనీగ తూనీగ” చిత్రం జూలై 20న విడుదలకు సిద్దమయ్యింది. ప్రముఖ నిర్మాత తన కొడుకు సుమంత్ అశ్విన్ ని పరిచయం చేస్తూ చేసిన చిత్రం ఇది. రియా చక్రవర్తి మరియు మనీషా యాదవ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. కార్తీక్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఎస్ గోపాల్ రెడ్డి ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందించారు. మాగంటి రాంబాబు నిర్మించిన ఈ చిత్రం దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ చిత్రం జూన్లో విడుదల కావలసి ఉంది కాని ఇప్పుడు పలు కారణాల మూలాన జూలై 20కి వాయిదా వేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు