శేఖర్ సూరి దర్శకత్వంలో వచ్చిన “ఏ ఫిలిం బై అరవింద్” చిత్రం అప్పట్లో మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఈ దర్శకుడు “అరవింద్ 2” చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. ఈ చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్ గా ఉండబోతుంది. ఇక్కడ ట్రైలర్ లాంచ్ సందర్భంగా అయన మాతో మాట్లాడారు ” ఆ చిత్రానికి “ఏ ఫిలిం బై అరవింద్” చిత్రానికి కథలో పోలికలు ఉండవు ఇది మర్డర్ మిస్టరీ మరియు సైకలాజికల్ థ్రిల్లర్ కాని ఆ చిత్రంలో చివరి దాక హంతకుడు ఎవరో తెలియదు. ఈ చిత్రంలో మొదట్లోనే హంతకుడు ఎవరో తెలిసిపోతుంది తరువాత కథ నడిపే విధానంలో కొత్తదనం చూపించాను” అని అన్నారు. ఈ చిత్రం జనవరి 26న విడుదలకు సిద్దమయ్యింది. కమల్ కామరాజు, శ్రీనివాస్ అవసరాల, ఆదోనిక తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.