పవన్ సినిమా కోసం వ్యూహరచన చేస్తున్న త్రివిక్రమ్

Pawan-Kalyan-and-Trivikram

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకి ‘అత్తారింటికి దారేది’ అనే టైటిల్ నిర్ణయించినట్టు అంతటా ప్రచారం జరుగుతోంది. గత కొద్ది రోజులుగా ఫ్యాన్స్, సినీ అభిమానులంతా ఈ టైటిల్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాని మంచి కామెడీతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. కావున త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ టైటిల్ ఎంచుకున్నారని ఈ చిత్ర ప్రొడక్షన్ టీంకి సంబందిచిన సన్నీతులు అంటున్నారు.కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం పవన్ పాత్రలో హీరోయిజం ఉండాలని, పవర్ఫుల్ గా ఉండాలని ఆశిస్తారు.

ఎవరైనా ఈ టైటిల్ ఏ ఫైనల్ అని అనుకుంటున్నారా? కానీ త్రివిక్రమ్ మాత్రం ఈ సినిమా టైటిల్ కోసం ఇంకా ఆలోచనలోనే వున్నాడు. ఈ సినిమా ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో సమంత, ప్రణిత హీరోయిన్ గా నటిస్తోంది.

Exit mobile version