ఎన్టీఆర్ సినిమా విషయంలో త్రివిక్రమ్ ఒక కీ డెసిషన్.?

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ చిత్రం తర్వాత పలు ప్రాజెక్టులు కూడా తారక్ కోసం ఎదురు చూస్తున్నాయి. అలాంటి వాటిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ప్లాన్ చేసిన సినిమా కూడా ఒకటి.

అయితే ఈ సినిమా RRR తర్వాతే మొదలవుతుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది.దీనికి ముందు ఈ ఇద్దరి కాంబోలో “అరవింద సమేత” లాంటి సినిమా చూసాక వీరి మలి ప్రాజెక్ట్ అనౌన్స్ చెయ్యగానే మంచి హైప్ వచ్చింది. ఇదిలా ఉండగా ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది.

ఈ చిత్రానికి త్రివిక్రమ్ ముందు ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా వచ్చే షేర్ లో కొంత భాగాన్ని తీసుకొనే యోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే ఇందులో ఎంత వరకు నిజముందో కానీ ప్రస్తుతానికి ఈ టాక్ అయితే సినీ వర్గాల్లో వినిపిస్తుంది.ఈ చిత్రాన్ని హారిక హాసిని మరియు నందమూరి తారక రామారావు ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Exit mobile version