అక్కినేని అఖిల్ ను లాంచ్ చేయనున్న త్రివిక్రమ్?

అక్కినేని అఖిల్ ను లాంచ్ చేయనున్న త్రివిక్రమ్?

Published on Nov 1, 2013 8:30 PM IST

Trivikram-and-Akshil

అక్కినేని ఫ్యామిలీ నుండి రాబోతున్న నటవారసుడు అఖిల్ అక్కినేని ఆ వంశానికి చెందిన అందగాళ్ళలో ఒకడు. అఖిల్ ఎంట్రీ కోసం టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తుంది. నాగార్జున అఖిల్ ఎంట్రీపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు

తాజా సమాచారం ప్రకారం అఖిల్ ఎంట్రీని త్రివిక్రమ్ చేతిలో పెట్టారట. ఈ విషయంపై నాగార్జున మరియు త్రివిక్రమ్ చాలాసేపు ముచ్చటించారు. కాకపోతే ఇరువర్గాల నుండీ ఇంకా ఎటువంటి సమాచారం అందలేదు.

ఈ ప్రాజెక్ట్ గనుక కార్యరూపం దాలుస్తే చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే త్రివిక్రమ్ ఇప్పటివరకూ కొత్త హీరోను లాంచ్ చేయలేదు. ఇది ఎంతవరకూ జరుగుతోందో చూద్దాం.. త్వరలో మిగిలిన వివరాలు తెలిజేస్తాం

తాజా వార్తలు