కొరటాలతో త్రిషాకు వచ్చిన ఆ క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏమిటో?

స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్స్ పాత్రలకు ఉండే ప్రాధాన్యం గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ కమర్షియల్ సినిమాలలో హీరోయిన్స్ కేవలం ఆరు పాటలు, హీరోతో రొమాన్స్ కే పరిమితం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి సినిమాలో హీరోయిన్ పాత్రకు సరైన ప్రాధాన్యమే ఉండని పక్షంలో అందులో క్రియేటివ్ డిఫరెన్సులు వచ్చే అవకాశం అనేది లేదు. మరి త్రిషా చెవుతున్నట్లు దర్శకుడు కొరటాల శివతో ఆమెకు వచ్చిన ఆ క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏమై ఉంటాయనే ఆలోచన ఇప్పుడు అందరిలో మొదలైంది.

త్రిషా చాల కాలం క్రితమే టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయ్యారు. అలాంటి తరుణంలో చిరు లాంటి హీరో పక్కన నటించే అవకాశాన్ని త్రిషా వదులుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పాత్ర పరిధి, ప్రాధాన్యత కొంచెం అటో ఇటో ఉన్నా సర్దుకుపోవాల్సిన టైం లో ఆమె డిమాండ్ ఉన్న హీరోయిన్ లా అలా ఎందుకు చేసింది అనేది అర్థం కాని విషయం. ఏది ఏమైనా అనవసరంగా త్రిష గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంది.

Exit mobile version