సంజయ్ దత్ తో నటించడానికి డేట్స్ లేవన్న త్రిష


డేట్స్ లేని కారణంగా “సామి” చిత్ర హిందీ రీమేక్ నుండి త్రిష తప్పుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం తమిళంలో ఈ చిత్రంతో త్రిష తమిళ పరిశ్రమలో మంచి పేరు సంపాదించింది. అప్పటి నుండి తమిళ చిత్రంలో ప్రముఖ తారగా ఎదిగింది. తరువాత ఈ చిత్రాన్ని తెలుగులో “లక్ష్మీ నరసింహ” చిత్రంగా తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని కే ఎస్ రవి కుమార్ హిందీలో సంజయ్ దత్ హీరోగా రీమేక్ చెయ్యాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో పోలిస్ ఆఫీసర్ గా విక్రమ్ చేసిన పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా త్రిషని తీసుకోవాలని అయన అనుకున్నారు. ఆమె నుండి ఆగష్టు డేట్స్ పొందాలని ఆయన అనుకున్నారు. ఇప్పటికే త్రిష చేతిలో రెండు తమిళ చిత్రాలు ఉన్నాయి. కావున తను ఈ చిత్రానికి డేట్స్ సమకూర్చలేకపోయింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఈ పాత్ర కోసం ప్రాచి దేశాయ్ ని తీసుకున్నట్టు తెలుస్తుంది 2010లో “కట్టా మీటా” చిత్రంతో బాలివుడ్లో పరిచయం అయిన త్రిష ఆ తరువాత బాలివుడ్లో ఏ చిత్రంలోనూ నటించలేదు.

Exit mobile version