త్రిషకు దక్కిన అద్బుతమైన అవకాశం

Trisha
త్రిషకు తన కెరీర్ నే మార్చేయగల అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఈమె గౌతం మీనన్ దర్శకత్వంలో తమిళ నటుడు సూర్య హీరోగా తెరకెక్కబోతున్న ఒక సినిమాకు సంతకం చేసింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో త్రిష పాత్ర వైవిధ్యంగా ఉండనుంది. ఈ పాత్రకోసం అమలా పాల్ ను అనుకున్నా చివరికి త్రిషకే దక్కింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మరికొన్ని రోజులలో ప్రారంభంకానుంది. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నాడు.

తమిళంలో ఈ సినిమా పేరు ‘ధృవ నట్చితిరం’గా ఖరారు చేసారు. తెలుగులో సూర్యకు ఉన్న మార్కెట్ ను పరిగణంలోకి తీసుకుని ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చెయ్యనున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో సిమ్రాన్ ఒక ముఖ్య పాత్ర పోషించనుంది.

ప్రస్తుతం త్రిష ఎం.ఎస్ రాజు తీస్తున్న ‘రంభ ఊర్వశి మేనక’ సినిమాతో బిజగావుంది

Exit mobile version