బస్ స్టాప్ ని గట్టెక్కించిన ట్రిబ్యునల్

బెల్లంకొండ సురేష్ నిర్మించిన ‘బస్ స్టాప్’ సినిమా కొద్ది రోజుల క్రితం సెన్సార్ జరుపుకొంది. సెన్సార్ వారు ఈ చిత్రానికి 45 కట్స్ విధించారు. ఈ కట్స్ చూసి మైండ్ బ్లాక్ అయిన ప్రొడక్షన్ టీం ఈ సినిమాని ట్రిబ్యునల్ కి పంపారు. వారు ఈ సినిమాని చూసి కేవలం ఒక 5 చిన్న చిన్న కట్స్ విధించి, ఈ సినిమాకి ‘ఎ’ సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ సెన్సార్ వారు విధించిన 45 కట్స్ కి మరియు ట్రిబ్యునల్ వారు విదించిన 5 కట్స్ కి మధ్య చాలా తేడా ఉంది. మీరేమంటారు ఫ్రెండ్స్ ?

ఈ సంవత్సరం ‘ఈ రోజుల్లో’ సినిమా ద్వారా హిట్ అందుకున్న మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ పక్కా యూత్ ఎంటర్టైనర్లో లవ్ మీద, బందాలు మీద మరియు ప్రస్తుతం యూత్ చేస్తున్న వాటిపై బాగా సెటైర్లు ఉన్నాయి. ఈ సినిమాని నవంబర్లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్ర విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా తెలియజేయనున్నారు.

Exit mobile version