‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రాన్ని నైజాంలో రిలీజ్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్

Tribanadhari-Barbarick

బాహుబలి యాక్టర్ సత్యరాజ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’ ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేయండి. ప్రాజెక్ట్ ‘త్రిబాణధారి బార్బరిక్’ ఇప్పుడు నైజాం ప్రాంతంలో విడుదలకు సిద్ధమైంది. ఈ భారీ బడ్జెట్ సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్ నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులు సొంతం చేసుకున్నారు

ఎపిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న త్రిబాణధారి బార్బరిక్‌లో అద్భుతమైన విజువల్స్, శక్తివంతమైన కథనం ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. చరిత్రాత్మక నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో భారీ సెట్స్, వీఎఫ్‌ఎక్స్‌తో కూడిన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను థియేటర్లలో కట్టిపడేస్తాయని మేకర్స్ నమ్ముతున్నారు. నైజాంలో ఈ సినిమాకు మంచి మార్కెట్ ఉండబోతుందని డిస్ట్రిబ్యూటర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటడం ఖాయమని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version