పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ కి ఇప్పుడు రాబోతుంది. అయితే కేవలం గ్లింప్స్ ఇంకా మొదటి పాట తోనే ఎనలేని అంచనాలు అందుకున్న ఈ సినిమా తాలూకా ట్రైలర్ కూడా ఏ రేంజ్ లో ఇంపాక్ట్ చూపనుందో అందరికీ తెలిసిందే.
మరి అలాంటి ట్రైలర్ రిలీజ్ కోసం ఇపుడు లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఓజి ట్రైలర్ కట్ ని మేకర్స్ ఈ సెప్టెంబర్ 19న విడుదల చేయనున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. అయితే ఇది రిలీజ్ కి చాలా దగ్గరలో అని చెప్పాలి. మరి ట్రైలర్ అప్పుడే వస్తుందా లేక ఇంకా ముందే వస్తుందా అనేది వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. అలాగే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహించారు.