దాదాపు రెండున్నర ఏళ్ల దీర్ఘ కాలం విరామం అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఓ ప్రాజెక్ట్ ను మొదలు పెట్టడంతో మళ్ళీ పవన్ అభిమానిలకు ప్రాణం లేచొచ్చింది. మళ్లీ సినిమా సంబరాలతో హోరెత్తించొచ్చు అనుకుంటే ఊహించని విధంగా కరోనా అడ్డంకిగా వచ్చి మరింత పెద్ద విరామంని అందించింది.
దీనితో ఇప్పటికే లేట్ కాబడిన ఈ చిత్రంలో పవన్ షూట్ ఇంకాస్త బ్యాలన్స్ ఉంది. ఈ షూట్ విషయంలోనే ఇప్పుడు మరింత సుస్పెన్సు నెలకొంది. కానీ ఇప్పుడు పవన్ చాతుర్మాస దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ ఇంకా ఆ లుక్ లోనే ఆధ్యాత్మికంగా ఉన్నారు. కానీ పవన్ ఈ దసరా తర్వాత నుంచే షూట్ స్టార్ట్ చేస్తారని టాక్ వినిపిస్తుంది.
కానీ ఇపుడు మరో టాక్ ఏమిటంటే పవన్ నవంబర్ చివరి వారం వరకు దీక్షలోనే ఉన్నారని తెలుస్తుంది. ఆ తర్వాత షూట్ లో పాల్గొంటారని మరో వెర్షన్. మొత్తానికి ఇలా పవన్ ఎంట్రీ పై అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి వీటిలో ఏది నిజమవుతుందో కాలమే నిర్ణయించాలి.