టాలీవుడ్ – బాలీవుడ్ మధ్య పోరు.!

టాలీవుడ్ – బాలీవుడ్ మధ్య పోరు.!

Published on Dec 5, 2012 3:48 PM IST

ప్రతి ఒక్క ఇండియన్ ని మీకు ఇష్టమైనది ఏది అని అడిగితే అది అబ్బాయి అయినా లేదా అమ్మాయి అయినా ఇచ్చే సమాధానం ఒకటి క్రికెట్ లేదంటే సినిమాలు. అదే బాలీవుడ్ – టాలీవుడ్ తారలు కలిసి క్రికెట్ ఆడితే అభిమానుల సందడి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. రెండు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కలిసి డిసెంబర్ 23న హైదరాబాద్లోని ఎల్.బి స్టేడియంలో క్రికెట్ ఆడనున్నారు. బాలీవుడ్ టీంకి సునీల్ శెట్టి కెప్టెన్, టాలీవుడ్ టీంకి శ్రీ కాంత్ కెప్టెన్. ఈ మ్యాచ్ ట్రోఫీని నిన్న హైదరాబాద్లో ఏర్పాటు చేసిన వేడుకలో విడుదల చేసారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

‘ఈ మ్యాచ్ ద్వారా వచ్చే మనీని పేద వారికి సాయం చేయడానికి ఉపయోగిస్తాం. ఈ మ్యాచ్ ని సరికొత్తగా ‘టి 10 స్టార్ సూపర్ టెస్ట్’ అని పెరుపెట్టాం. ఆడియన్స్ ఈ మ్యాచ్ కోసం చాలా ఎదురు చూస్తున్నారని నాకుతెలుసని’ సునీల్ శెట్టి అన్నారు. ‘గత సంవత్సరం అనతపురంలో జరిగిన మ్యాచ్ లో తెలుగు స్టార్స్ మాత్రమే ఆడాము. ఈ సారి బాలీవుడ్ టీంతో కలిసి ఆడుతున్నామని’ శ్రీకాంత్ అన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు