ప్రస్తుత ట్రెండ్ లో యువతకి సినిమాల్లో కొన్ని సాంగ్స్ బాగా కనెక్ట్ అవుతున్నాయి. లిరిక్స్, ట్యూన్ మాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లు పడితే సోషల్ మీడియాలో వాటి ఇంపాక్ట్ మరో లెవెల్లో వైరల్ అవుతుంది. అలా ఆ మధ్య అంతా అనిరుద్ పాటలు గట్టిగా వినిపించేవి. బీస్ట్, మాస్టర్, రీసెంట్ అయితే అయితే జైలర్ నుంచి హుకుం టైగర్ కా హుకుం సాంగ్ చేసిన రచ్చ కానీ దానికి వచ్చిన రీచ్ గాని మరో లెవెల్.
అయితే దీనికి మన టాలీవుడ్ నుంచి సమాధానంగా సంగీత దర్శకుడు థమన్ నుంచి డాకు మహారాజ్ సినిమాలో టైటిల్ సాంగ్ సెన్సేషన్ ని సెట్ చేసింది. తమిళ సాంగ్స్ కి మన తెలుగు యువత ఎలా ఎడిట్స్ చేసుకున్నారో అలా మన డాకు సాంగ్ తో తమిళ ఆడియెన్స్ కూడా ఎడిట్స్ చేసుకున్నారు. ఇక లేటెస్ట్ గా మరో వెర్షన్ ‘సర్కారురా’ ని రిలీజ్ చేయగా దీనికి కూడా అంతకు మించిన రెస్పాన్స్ ఆడియెన్స్ నుంచి వస్తుంది. అన్ని ఫ్యాన్డమ్స్ కూడా దీనిపై ఎడిట్స్ స్టార్ట్ చేసుకున్నారు. దీనితో ఈ సాంగ్ తో కూడా థమన్ గట్టి సిక్సర్ నే కొట్టాడని చెప్పవచ్చు.