ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలి మరణం దేశంలో పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది. మన దేశంలో ఆడవాళ్ళ రక్షణ పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు ప్రశ్నార్ధకం అయ్యాయి. ఇదే విషయం మీద పలువురు తెలుగు తారలు వారి బాధను మరియు ఆవేశాన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో తెలిపారు. అమనథ్,దామిని మరియు నిర్భయ అన్న పేర్లతో మీడియా బాధితురాలిని ప్రస్తావిస్తూ వస్తుంది. ఈ సంఘటన గురించి అమితాభ్ బచ్చన్,త్రిష, శ్రీదేవి, చార్మీ, ప్రియమణి వంటి పలు తారలు తీవ్రంగా స్పందించారు. నిందితులకు మరణ శిక్ష విదించాలని దేశం మొత్తం ప్రభుత్వాన్ని కోరుతుంది. ఈ నెల 16న దేల్హిలో ఆరు మంది అతి క్రూరంగా కొట్టి రేప్ చేశారు. 12 రోజుల పోరాటం తరువాత అమనథ్ సింగపూర్ హాస్పిటల్ లో ఈరోజు తుది శ్వాస విడిచారు.