అప్పటివరకు అన్ని సినిమాల షూటింగ్స్ బంద్..!

అప్పటివరకు అన్ని సినిమాల షూటింగ్స్ బంద్..!

Published on Mar 15, 2020 9:24 PM IST

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టకపోతే దారుణ పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఇండియాలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇక చిత్ర పరిశ్రమ సైతం ఎన్నడూ లేని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇప్పటికే అనేక చిత్రాల విడుదల నిలిపివేశారు. అలాగే చిత్ర షూటింగ్ షెడ్యూల్స్ ఆపివేయడం జరిగింది.

కాగా టాలీవుడ్ కి చెందిన అన్ని విభాగాలకు చెందిన ఆర్టిస్ట్స్ మార్చి 31 వరకు చిత్ర షూటింగ్స్ లో పాల్గొన కూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అలాగే 24 క్రాఫ్ట్స్ కి చెందిన ప్రముఖులు నేడు ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశమై దీనిపై స్ఫష్టమైన ప్రతిపాదన చేయనున్నారట. కాబట్టి ఈ నెలాఖరు వరకు టాలీవుడ్ లో ఏ సినిమా షూటింగ్ జరిగే పరిస్థితి కనబడడం లేదు.

తాజా వార్తలు