టుడే మహేష్ కి వెరీ స్పెషల్ డే..!

టుడే మహేష్ కి వెరీ స్పెషల్ డే..!

Published on Apr 20, 2020 9:59 AM IST

సూపర్ స్టార్ మహేష్ జీవితంలో నేడు చాలా ముఖ్యమైన రోజు అట. దానికి కారణం ఆయన తల్లిగారైన ఇందిరా దేవి పుట్టిన రోజు కావడమే. ఏప్రిల్ 20 ఆమె పుట్టిన రోజు కావడంతో మహేష్ ఇందిరా దేవి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా హ్యాపీయా బర్త్ డే అమ్మ..ఈ రోజు నా జీవితంలో గొప్ప రోజు అని ఆయన పోస్ట్ పెట్టారు. సూపర్ స్టార్ కృష్ణ 1961లో ఇందిరా దేవి గారిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఐదుగురు సంతానం కాగా వారిలో మహేష్ ఒకరు.

ఇక మహేష్ నెక్స్ట్ మూవీ దర్శకుడు పరుశురాం తో చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మే 31న కృష్ణ గారి జన్మదినం కావడంతో ఆ రోజు ఈ కొత్త చిత్ర ప్రకటన ఉండే అవకాశం కలదు. ఇక రాజమౌళి తన నెక్స్ట్ మూవీ మహేష్ తో అని స్పష్టత ఇచ్చారు. ఈ చిత్రం 2022లో విడుదలయ్యే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు