‘పంజా’ సినిమాలో విలన్ గా నటించిన అడవి శేష్ ను హీరోగా ‘కిస్’ అనే సినిమాలో చూడనున్నాం. కీప్ ఇట్ స్మైల్ స్టుపిడ్ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. ‘కర్మ’ సినిమా తరువాత శేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సాయికిరణ్ అడవి నిర్మాత. ప్రియా బెనర్జీ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఈ రోజు టైటిల్ ట్రాక్ ఇంటర్నెట్లో విడుదల చేయగా అది యువతను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా గురించి శేష్ మాట్లాడుతూ “మేము విడుదల చేసిన పాట సినిమా నేపధ్యాన్ని తెలియజేస్తుంది. ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కోగల సామాన్యమైన వ్యక్తిగా కనిపించానున్నాను. ఇందులో ఒక మంచి సిద్దాంతాన్ని కుడా జతపరిచాము. ఈ సినిమా టైటిల్ హీరొయిన్ పాత్ర కోసమే పెట్టాము. ఆమె మొదటి కిస్ తన జీవితాన్ని ఎలా మార్చింది అనేది ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కధ “అని తెలిపారు. సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని జూన్ లో ఆడియో విడుదలకు సిద్దమవుతుంది. శ్రీచరణ్ సంగీతం అందించాడు.