తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ చిత్రానికి ‘కరుప్పు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఆర్ జె బాలాజీ డైరెక్ట్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. జూలై 23న సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.
కరుప్పు చిత్రానికి సంబంధించిన టీజర్‌ను జూలై 23న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఈ అనౌన్స్‌మెంట్‌ను చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌తో రివీల్ చేశారు. ఈ పోస్టర్లో సూర్య పక్కా మాస్ లుక్‌తో తనదైన స్వాగ్తో నడుచుకుంటూ వస్తున్నాడు.
ఇక ఈ పోస్టర్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమా టీజర్‌పై కూడా అప్పుడే అంచనాలు పెరిగాయి. ఈ టీజర్‌ను పవర్‌ప్యాక్డ్‌గా కట్ చేసినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో అందాల భామ త్రిష హీరోయిన్గా నటిస్తోంది. మరి ఈ సినిమా టీజర్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే రేపు ఉదయం 10 గంటలకు వరకు వేచి చూడాల్సిందే.