ది విజయ్ ‘కింగ్డమ్’ కోసం సందీప్ వంగ?

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ ది విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం కింగ్డమ్ కోసం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ఇంకొన్ని రోజుల్లోనే విడుదల కాబోతుండగా సాలిడ్ ప్రమోషన్స్ కోసం సినిమా సిద్ధం అవుతుంది.

కింగ్డమ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ ప్రమోషన్స్ లో విజయ్ బ్లాక్ బస్టర్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ భాగం కానున్నట్టుగా తెలుస్తుంది. విజయ్ తో ఒక స్పెషల్ ఇంటర్వ్యూని వీరు ప్లాన్ చేస్తున్నారట. మరి ఇది డెఫినెట్ గా చిత్రానికి మంచి బూస్టప్ గా నిలిచే అవకాశం ఉందని చెప్పవచ్చు.

అలాగే ఈ ఇంటర్వ్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బయటకి రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు సంయుక్తం నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ జూలై 31న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

Exit mobile version