కన్ఫర్మ్ : కింగ్డమ్ ట్రైలర్ వచ్చేది ఆ రోజే..!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని జూలై 31న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే, ఈ ట్రైలర్‌ను జూలై 26న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఈ మేరకు ఓ సాలిడ్ పోస్టర్‌ను వారు రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను తిరుపతిలో నిర్వహించబోతున్నట్లు వారు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎలా జరగబోతుందా అనే ఆసక్తి నెలకొంది.

ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని.. సత్యదేవ్ పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు. భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

Exit mobile version