‘అసుర హననం’ చేస్తున్న వీరమల్లు.. మూడో పాటకు టైమ్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ ‘హరిహర వీరమల్లు’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను పూర్తి హిస్టారికల్ ఎపిక్ చిత్రంగా రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ వీరమల్లు పాత్రలో ప్రేక్షకులను స్టన్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్, రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది.

ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేస్తూ ఈ మూవీ నుంచి మూడో పాటను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈ సినిమాలోని మూడో సింగిల్ సాంగ్‌గా ‘అసరుల హననం’ అనే పాటను మే 21న ఉదయం 11.55 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఓ సాలిడ్ పోస్టర్‌తో వారు ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు.

ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తుండగా అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏ.ఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తుండగా జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

Exit mobile version