“వకీల్ సాబ్” జాతరకు టైం ఫిక్స్ అయ్యింది.!

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “వకీల్ సాబ్”. ఇది ఒక రీమేక్ చిత్రం అయినప్పటికీ చాలా కాలం తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో తారా స్థాయి అంచనాలు ఉన్నాయి. ఇక ఎలాగో రేపు పవన్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో హంగామా అప్పుడే షురూ అయ్యిపోయింది.

ఇక చిత్ర యూనిట్ అంతా కూడా ఇప్పుడు ఒక అధికారిక అప్డేట్ ను కూడా ఇచ్చేసారు. ఈ చిత్ర నిర్మాణ సంస్థలు తారాగణం సహా ఇతర టెక్నిషియన్స్ కూడా “వకీల్ సాబ్” నుంచి రేపు ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ఒక సంథింగ్ స్పెషల్ ఉందని ఊరిస్తున్నారు. దీనితో ఇక సోషల్ మీడియాలో అసలు జాతరకు టీమ్ ఫిక్స్ అయ్యినట్టు అయ్యింది.

మరి చిత్ర యూనిట్ ఇంకా ఏం ప్లాన్ చేశారు అన్నది మాత్రం ఇంకా గోప్యంగానే ఉంది. మరి వీరు ప్లాన్ చేసిన ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటో తెలియాలి అంటే రేపు పవన్ పుట్టినరోజు వరకు ఆగాల్సిందే. ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తుండగా నివేతా థామస్ మరియు అంజలిలు కీ రోల్స్ చేస్తున్నారు. అలాగే దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version