‘అఖండ 2’ నుంచి బిగ్ రివీల్ కి సమయం వేదిక ఖరారు!


నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అవైటెడ్ చిత్రమే “అఖండ 2 తాండవం”. ఆల్రడీ ఈ సినిమా నుంచి వచ్చిన టైటిల్ సాంగ్ పాన్ ఇండియా ఆడియెన్స్ ని అలరిస్తుంది. ఇలా రిలీజ్ దగ్గరకి వస్తున్న నేపథ్యంలో మేకర్స్ కూడా అన్ని పనులు మరింత ముమ్మరం చేశారు. ఇలా లేటెస్ట్ గా మరో బిగ్ రివీల్ కి సమాయత్తం అవుతున్నారు.

ఇలా రేపు నవంబర్ 16 ఉదయం 10 గంటలకి ఆ గ్రాండ్ రివీల్ ని చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇందుకు హైదరాబాద్ లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లోని స్క్రీన్ 1 ని వేదికగా నియమించారు. సో ఆ బిగ్ రివీల్ ఏంటి అనేది అప్పుడు చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ ప్లస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

Exit mobile version