ఈ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘కే – ర్యాంప్’

K-Ramp Telugu Movie Review

ఈ దీపావళి కానుకగా మన తెలుగు సినిమా నుంచి వచ్చిన సూపర్ హిట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా యుక్తి తరేజా హీరోయిన్ గా దర్శకుడు జైన్స్ నాని తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సాలిడ్ కిరణ్ కెరీర్లో మరో మంచి హిట్ గా నిలిచి లాభాలు అందించింది. ఇక ఈ సినిమా ఫైనల్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

ఈ సినిమా ఓటిటి హక్కులు మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు సొంతం చేసుకోగా అందులో నేడు నవంబర్ 15 నుంచి స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఈ చిత్రాన్ని అప్పుడు మిస్ అయ్యినవారు ఇప్పుడు ఆహా లో చూసి ఎంటర్టైన్ అవ్వొచ్చు. ఇక ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా రాజేష్ దండ, శివ బొమ్మక్ లు నిర్మాణం వహించారు. అలాగే నరేష్, సాయి కుమార్ లాంటి సీనియర్ నటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.

Exit mobile version