తెలుగు సినిమా దగ్గర తనదైన ముద్ర వేసుకున్న దివంగత ధృవ తారా నటుల్లో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు. మరి తన వారసునిగా వచ్చి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు గ్లోబల్ సినిమాకి పరిచయం కాబోతున్నాడు. నేడు నవంబర్ 15 కృష్ణ గారి వర్ధంతి. ఇది మహేష్ బాబు జీవితంలోనే ఒక మర్చిపోలేని రోజు. మరి ఇలాంటి రోజుని చిరస్థాయిగా నిలిచే విధంగా మార్చడం అనేది ఐకానిక్ అని చెప్పాలి.
నేడు తన అవైటెడ్ సినిమా తాలూకా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం సర్వం సిద్ధం అయ్యింది. ప్రపంచమే మహేష్ బాబు వైపు తిరిగేలా మార్చుకున్నాడు. ఒక చారిత్రాత్మిక ఘట్టాన్ని తన తండ్రికి నివాళిగా మార్చినట్టే అని కూడా చెప్పాలి. తాజాగా మహేష్ బాబు ఈ వర్ధంతి రోజున చేసిన భావోద్వేగపూరిత పోస్ట్ తో కూడా ఈరోజు మిమ్మల్ని ఇంకొంచెం ఎక్కువ స్మరించుకుంటాను మీరు గర్వపడతారు నాన్న అంటూ తన చిన్ననాటి ఫోటో ఒకటి కృష్ణ గారితో షేర్ చేయడం జరిగింది.
సో ఖచ్చితంగా మహేష్ బాబు అభిమానులు ఘట్టమనేని కుటుంబంలో కూడా ఈ నవంబర్ 15 అనే తేదీ మరో రకంగా గుర్తుండిపోయేలా తన చరిత్రని మహేష్ బాబు లిఖించుకున్నట్టే అని కూడా చెప్పొచ్చు. మరి దర్శకుడు రాజమౌళి అండ్ టీం దీనిని ఎలా ప్లాన్ చేసారో వేచి చూడాలి.
Thinking of you a little more today…
and knowing you’d be proud nanna ♥️♥️♥️ pic.twitter.com/yuW1g9WOky— Mahesh Babu (@urstrulyMahesh) November 15, 2025
