డబ్బింగ్ సినిమాలకి కూడా హైక్స్ అవసరమా?

డబ్బింగ్ సినిమాలకి కూడా హైక్స్ అవసరమా?

Published on Aug 12, 2025 7:01 AM IST

war2-coolie

మన టాలీవుడ్ సినిమా దగ్గర టికెట్ ధరల హైక్ లు అనేది దాదాపు ఓ దశాబ్దం కితం మొదలైంది. భారీ బడ్జెట్ పెట్టారని ఒకవేళ టాక్ కొంచెం అటు ఇటు అయితే ప్రారంభ రోజుల్లో అయినా ఎక్కువ రికవర్ అవుతుంది అనే నెపంతో హైక్స్ అనే కాన్సెప్ట్ మొదలైంది.

అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమాలకు హైక్స్ అంటే ఓకే కానీ డబ్బింగ్ సినిమాలకి కూడా హై బడ్జెట్ లేని మిడ్ రేంజ్ సినిమాలకి కూడా ఇష్టానుసారంగా హైక్స్ ఇచ్చేస్తున్నారు అని టాక్ గట్టిగా సాగుతోంది. ముఖ్యంగా ఏపీలో ఈ తంతు ఎక్కువగా సాగుతోంది. ప్రతీ సినిమాకి ఇలా అప్లై చేస్తే అలా హైక్స్ వచ్చేస్తున్నాయి.
ఇక లేటెస్ట్ గా భారీ డబ్బింగ్ సినిమాలు వార్ 2, కూలీ లకి కూడా ఏపీలో టికెట్ ధరలు పెంచడం అనేది సోషల్ మీడియాలో నెగిటివ్ స్పందన తీసికొస్తున్నాయి.

ఇక లేటెస్ట్ గా భారీ డబ్బింగ్ సినిమాలు వార్ 2, కూలీ లకి కూడా ఏపీలో టికెట్ ధరలు పెంచుతున్నారు అనే మాటకే సోషల్ మీడియాలో నెగిటివ్ స్పందన తీసికొస్తున్నాయి. అసలు డబ్బింగ్ సినిమాలకి హైక్స్ ఎందుకు అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఓ పక్క కొందరు నిర్మాతలే హైక్స్ మూలన జనం థియేటర్స్ కి రావట్లేదు అంటారు. మళ్లీ వాళ్లే పెంచుకుంటారు అంటూ పలు విమర్శలు వచ్చిపడుతున్నాయి.

తాజా వార్తలు