టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
జూలై 31న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోన్న ఈ సినిమా టికెట్ రేట్ల పెంపు కోసం ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్ర టికెట్ రేట్లు సింగిల్ స్క్రీన్స్‌కు రూ.50, మల్టీప్లెక్స్‌లకు రూ.75 వరకు అదనంగా పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ పెంపు పది రోజుల పాటు ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఈ సినిమాకు ఏపీలో మంచి వసూళ్లు రావడం ఖాయమని మేకర్స్ భావిస్తున్నారు. ఇటు తెలంగాణలో ఈ చిత్ర టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.
ఇక కింగ్డమ్ చిత్రంలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తుండగా సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.