వైరల్: సంధ్య థియేటర్ ‘వీరమల్లు’ స్క్రీనింగ్ వద్ద అకిరానందన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమానే “హరిహర వీరమల్లు”. దర్శకులు క్రిష్ జాగర్లమూడి అలాగే జ్యోతిక్రిష్ణ తెరకెక్కించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఒక్క వి ఎఫ్ ఎక్స్ మినహా మిగిలిన అంశాల్లో మంచి టాక్ అందుకుంది.

అయితే ఈ వీకెండ్ లో సినిమా చూసేందుకు అది కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఫేమస్ సింగిల్ స్క్రీన్ సంధ్య థియేటర్ దగ్గర పవర్ స్టార్ వారసుడు అకిరా నందన్ కనిపించడం వైరల్ గా మారింది. మరి తన షో అయ్యిపోయాక థియేటర్ ప్రాంగణంలో కనిపించిన విజువల్స్ వైరల్ గా మారాయి. దీనితో అభిమానులు ఈ క్లిప్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version