పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఈ సినిమాను క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్ట్ చేయగా పూర్తి పీరియాడిక్ ఎపిక్ చిత్రంగా ఇది ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ఈ సినిమాకు ప్రీమియర్స్ కూడా భారీ స్థాయిలో వేశారు మేకర్స్. దీంతో ఈ సినిమా తొలిరోజు కలెక్షన్స్ ఎంత వచ్చి ఉంటాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే, వీరమల్లు చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టాయి. ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా దాదాపు రూ.44 కోట్ల షేర్ వసూళ్లు సాధించినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇందులో నైజాం ఏరియాలో రూ.12 కోట్లు, సీడెడ్‌లో రూ.5 కోట్లు, ఆంధ్రలో రూ.17 కోట్ల మేర షేర్ వసూళ్లు రాబట్టిందని.. ప్రీమియర్స్ రూపంలో, ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియా రూపంలో ఈ సినిమా మిగతా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక డే1 తో పోలిస్తే, డే 2 వసూళ్లు కొంతమేర తగ్గుతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మౌత్ టాక్‌తో ఈ సినిమాకు కొంత వరకు ఎఫెక్ట్ పడనుందని.. దాని ప్రభావం సినిమా వసూళ్లపై పడవచ్చని వారు అభిప్రాయ పడుతున్నారు.
ఇక మొత్తంగా చూస్తే పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ఈ చిత్రం టాప్ వసూళ్లతో నిలిచింది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించాడు. ఎంఎం.కీరవాణి సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఈ చిత్రాన్ని ఏ.ఎం.రత్నం ప్రొడ్యూస్ చేశారు.