అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ వచ్చే వారం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు జ్యోతికృష్ణ పవర్‌ఫుల్ హిస్టారికల్ ఎపిక్‌గా రూపొందించాడు. ఇక ఈ సినిమాలో పవన్ పాత్ర ప్రేక్షకులను అబ్బురపరుస్తుందని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.
అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టికెట్ రేట్లు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హరిహర వీరమల్లు చిత్ర టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్స్‌కు రూ.150, మల్టీప్లెక్స్‌కు రూ.200 పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ లెక్కన ఏపీలో సింగిల్ స్క్రీన్ అప్పర్ బాల్కనీ టికెట్ ధర రూ.297, మల్టీప్లెక్స్ టికెట్ ధర రూ.377 గా ఉండనుంది. ఈ టికెట్ రేట్ల పెంపు పది రోజుల వరకు ఉంటుందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
ఇక ఈ టికెట్ రేట్ల పెంపుతో తమ సినిమాకు కలిసొస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించేందుకు ఇది దోహదపడుతుందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటు తెలంగాణలో కూడా టికెట్ రేట్లు పెంచేందుకు ప్రభుత్వాన్ని కోరగా, దీనిపై నిర్ణయం ఇంకా రావాల్సి ఉంది.