ఈ వారం బాక్సాఫీస్ దగ్గర ‘థగ్ లైఫ్’దే జోరు!

ఈ వారం బాక్సాఫీస్ దగ్గర ‘థగ్ లైఫ్’దే జోరు!

Published on Jun 5, 2025 1:01 AM IST

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ లేటెస్ట్ మూవీ ‘థగ్ లైఫ్’ మరికొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాను దర్శకుడు మణిరత్నం డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికితోడు ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే, ఈ వారం తెలుగు బాక్సాఫీస్ దగ్గర కూడా పెద్ద సినిమాలేమీ లేకపోవడంతో ‘థగ్ లైఫ్’కే ప్రేక్షకులు ప్రిఫరెన్స్ ఇవ్వనున్నారు. హరిహర వీరమల్లు వచ్చే వారం రిలీజ్ కావాల్సి ఉన్నా, అది వీలు పడకపోవడంతో థగ్ లైఫ్ చిత్రానికి బాగా కలిసిరానుంది. థగ్ లైఫ్ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే వచ్చే వారం కూడా ఈ మూవీకే ఆడియన్స్ ప్రిఫరెన్స్ ఇవ్వనున్నారు.

మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాలో త్రిష, శింబు, అభిరామి, అశోక్ సెల్వన్, జోజు జార్జ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు