చిరు, బాలయ్య నాకు పోటీ కాదన్న శోభన్ బాబు, కారణం..?

టాలీవుడ్ సోగ్గాడు హీరో శోభన్ బాబు ఓ సభలో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరంజీవి, బాలకృష్ణ పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 1993లో ఓ సన్మాన వేడుకకు హాజరైన శోభన్ బాబును చిరంజీవి, బాలకృష్ణ మీకు పోటీగా భావిస్తున్నారా అని అడుగగా.. శోభన్ బాబు ఇలా స్పందించారు.

బాలకృష్ణ, చిరంజీవి నాకు కొడుకులతో సమానం. నా కొడుకు వయసులోనే వారున్నారు. కాబట్టి వాళ్ళను నేను నాకు పోటీగా అనుకోను. ఎందుకంటే ఏ తండ్రి కూడా వాళ్ళ పిల్లలతో పోటీపడాలని అనుకోడు” అని శోభన్ బాబు అధ్బుతమైన సమాధానం చెప్పారు. 90లనాటికే చిరంజీవి, బాలకృష్ణ స్టార్ హీరో హోదా తెచ్చుకోగా శోభన్ బాబు 1996వరకు సోలో హీరోగా మరియు మల్టీస్టారర్ లలో నటించారు.

https://mobile.twitter.com/cnupatnam/status/1273201609728638978

Exit mobile version