బాంబ్స్ ప్లాట్ తో థ్రిల్లింగ్ గా సాగే విశ్వరూపం

బాంబ్స్ ప్లాట్ తో థ్రిల్లింగ్ గా సాగే విశ్వరూపం

Published on Jan 7, 2013 8:58 PM IST

Vishwaroopam
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా నటించిన సినిమా ‘విశ్వరూపం’. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది, అదేమిటంటే న్యూక్లియర్ బాంబ్స్ దొంగతనం చేయగా వాటిని వెతికే పనిలో సాగే థ్రిల్లర్ సినిమా ఇదని అంటున్నారు. ఈ సినిమాని ఎక్కువ భాగం అఫ్గానిస్తాన్, అమెరికా, ఇండియాలలో చిత్రీకరించారు. విశ్వరూపం సినిమాని జనవరి 10న డి.టి.హెచ్ లో ప్రీమియర్ షోస్ వేయనున్నారు. ఈ సినిమా డి.టి.హెచ్ ద్వారా బిజినెస్ చేసే కొత్త విధానాన్ని మొదలుపెట్టింది. ఆండ్రియా జెరేమియా – పూజా కుమార్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో శేఖర్ కపూర్, రాహుల్ బోస్ కీలక పాత్రలు పోషించారు.

తాజా వార్తలు