చరణ్ ను మెప్పించిన ఈ యంగ్ డైరెక్టర్..?

చరణ్ ను మెప్పించిన ఈ యంగ్ డైరెక్టర్..?

Published on Jul 21, 2020 5:29 PM IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ మల్టీస్టారర్ పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అదే విధంగా దీని తర్వాత కూడా రామ్ చరణ్ లైన్ లో ఉన్నారు. అయితే మరో టాలెంటెడ్ దర్శకుడు రామ్ చరణ్ ను తన స్క్రిప్ట్ తో మెప్పించినట్టు తెలుస్తుంది.

యువ హీరో నాగశౌర్య తో “ఛలో” రీసెంట్ గా యూత్ స్టార్ నితిన్ తో “భీష్మ” సినిమాలతో మంచి హిట్స్ కొట్టిన దర్శకుడు వెంకీ కుడుముల తాజాగా చరణ్ కు ఒక లైన్ ను వినిపించినట్టు తెలుస్తోంది. దానికి చరణ్ కూడా ఇంప్రెస్ అయ్యాడట. ఇక అన్ని సెట్టయితే వచ్చే ఏడాది సెకండాఫ్ లో ఈ చిత్రం మొదలయ్యే అవకాశం ఉందని బజ్ వినిపిస్తుంది. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

తాజా వార్తలు