దారుణం…ఒక్క స్టార్ హీరో కూడా రావడంలేదు!

ప్రపంచ చరిత్రలో 2020 ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోనుంది. కరోనా వైరస్ వలన జీవితాలు ఛిద్రం అవుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా సినిమా పరిశ్రమలు కుదేలయ్యాయి. కరోనా వైరస్ కారణంగా స్థంభించి పోయిన చిత్ర పరిశ్రమ అనేక మంది కన్నీళ్లకు కారణం అవుతుంది. కాగా మిగిలిన 2020లో టాలీవుడ్ నుండి ఒక్క స్టార్ హీరో మూవీ కూడా విడుదల కావడం లేదు. ఎన్టీఆర్, చరణ్ ల ఆర్ ఆర్ ఆర్ వచ్చే ఏడాదికి అధికారకంగా షిఫ్ట్ కాగా, ప్రభాస్ రాధే శ్యామ్, బన్నీ పుష్ప సైతం వచ్చే ఏడాదికి షెడ్యూల్ చేయడం జరిగింది.

మహేష్ విషయానికి వస్తే ఆయన ఇంకా మొదలు పెట్టలేదు. ఈ ఏడాది చిరు ఆచార్య మూవీతో ఫ్యాన్స్ ని పలకరిస్తారని అందరూ అనుకున్నారు. ఆయన షూటింగ్స్ కి హాజరుకావడానికి ఆసక్తి చూపడం లేదు. 2020లో ఖచ్చితంగా వస్తాడనుకున్న హీరో పవన్ కళ్యాణ్. ఆయన లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఆయన ఖచ్చితంగా మూవీ విడుదల చేస్తారని అందరూ భావించారు. పవన్ తాజా వ్యాఖ్యలతో వకీల్ సాబ్ షూటింగ్ కూడా ఈ ఏడాది లేనట్లే అని అర్ధం అయిపోయింది.కాబట్టి వకీల్ సాబ్ విడుదల కూడా లేనట్లే. దీనితో మిగిలిన 2020 స్టార్ హీరో ఎంట్రీ లేకుండానే ముగియనుంది.

Exit mobile version