WAR 2: IPL ఫైనల్లో స్పెషల్ ప్రోమో అందుకే మిస్!?

WAR 2: IPL ఫైనల్లో స్పెషల్ ప్రోమో అందుకే మిస్!?

Published on Jun 4, 2025 9:00 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ల కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం వార్ 2 కోసం అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్ గానే వచ్చిన టీజర్ కి అదిరే రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఈ ఐపీఎల్ ఫైనల్ నిన్న జరిగిన సంగతి తెలిసిందే.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అలాగే పంజాబ్ కింగ్స్ నడుమ జరిగే ఈ ఉత్కంఠభరిత పోరులో స్పెషల్ గా వార్ 2 కొత్త ప్రోమో పాన్ ఇండియా లెవెల్లో ఆడియెన్స్ కి రీచ్ అయ్యే విధంగా యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ కొత్త కంటెంట్ ని ప్లే చేస్తారని తెలిసింది. కానీ తీరా ఐపీఎల్ వీక్షకులకు పాత టీజర్ లో క్లిప్ నే వేశారు. అయితే స్పెషల్ ప్రోమో ఎందుకు మిస్ అయ్యిందో ఇపుడు టాక్ వినిపిస్తుంది.

దీని ప్రకారం ఆ ప్రోమోకి సంబంధించిన విఎఫ్ఎక్స్ పనులు కంప్లీట్ కాకపోవడం వల్లే రాలేదు అని తెలుస్తుంది. సో ఇలా వార్ 2 కొత్త ట్రీట్ మిస్ అయ్యిందట. మరి నిన్న మ్యాచ్ ఊపులోనే ఈ కొత్త గ్లింప్స్ కూడా వచ్చి ఉంటే ఇంకో లెవెల్లో ఉండేదని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రం ఆగస్ట్ 14న తెలుగు, హిందీ మరియు తమిళ్ భాషల్లో విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు