ఇపుడు మన దక్షణాది నుంచి ఇండియన్ బాక్సాఫీస్ పైకి దండెత్తడానికి రెడీ అవుతున్న భారీ ప్రాజెక్టులలో “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ ఏ ఆగష్టు 26 నుంచి మళ్ళీ పునః ప్రారంభం కానుంది అని చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసిన విధంగానే ఈరోజు ఈ చిత్రం మొదటి రోజు షూటింగ్ మొదలైంది.
అందులోని ఈ రోజు షూటింగ్ లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పాల్గొనడం విశేషం. ఈరోజు నుంచి తాను కూడా మళ్ళీ తిరిగి షూటింగ్ లో పాల్గొన్నట్టు ప్రకాష్ రాజ్ ఫోటోల ద్వారా కేజీయఫ్ 2 షూట్ లోని వర్కింగ్ ఫోటోలు ద్వారా తెలిపారు. చాలా తక్కువమంది సిబ్బందితో నీల్ ఈ షూట్ ను ఆరంభించారు. అయితే ఈ చిత్రంలో హీరో రోల్ తో పాటు అంతటి ప్రాధాన్యత ఉన్న నెగిటివ్ రోల్ చేస్తున్న సంజయ్ దత్ ఎప్పుడు మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటారు అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
Start Camera..Action… BACK TO WORK.. pic.twitter.com/LzFFhJrsjG
— Prakash Raj (@prakashraaj) August 26, 2020