తమిళ హీరో సూర్య ప్రస్తుతం దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో రూపొందుతున్న తన 46వ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇక ఆయన నటిస్తున్న ‘కరప్పు’ త్వరలో రిలీజ్‌కు రానుంది. అయితే, ఈ సినిమాలతో బిజీగా ఉన్న సూర్య ఇప్పుడు మరో తెలుగు డైరెక్టర్ కథను విన్నట్లుగా తెలుస్తోంది.
రీసెంట్‌గా టాలీవుడ్ దర్శకుడు పరశురామ్ సూర్యకు ఓ కథను చెప్పాడనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు మరో తెలుగు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కూడా సూర్యకు ఓ కథను వినిపించారని తెలుస్తోంది.
ఈ వార్తలతో అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది. త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని వారు ఆశిస్తున్నారు. వివేక్ ఆత్రేయ లాస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్‌గా నిలిచింది. మరి సూర్య కోసం ఆయన ఎలాంటి కథను రెడీ చేశాడో చూడాలి.
