బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ కి ఆ కఠిన నిబంధన?

బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ కి ఆ కఠిన నిబంధన?

Published on Jul 18, 2020 12:07 AM IST

బిగ్ బాస్ తెలుగు విజయ పథంలో దూసుకుపోతుంది. 2017లో ఎన్టీఆర్ తో మొదలైన బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోని నాని, నాగార్జున సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్లారు. కాగా బిగ్ బాస్ సీజన్ ఫోర్ కి కూడా వేళయ్యింది. కరోనా వ్యాప్తి దారుణంగా ఉన్నప్పటికీ బిగ్ బాస్ నిర్వహించి సీజన్ ని క్యాష్ చేసుకోవాలని స్టార్ మా యాజమాన్యం నిశ్చయించింది. దీని కోసం భద్రాతా చర్యలపై దృష్టి కేంద్రీకరించారట. అలాగే కొన్ని కొత్త కఠిన నిబంధనలు అమలులోకి తేనున్నట్లు తెలుస్తుంది.

ముఖ్యంగా హౌస్ లో పాల్గొనడానికి ఎంపికైన కంటెస్టెంట్స్ కి కరోనా టెస్టులు నిర్వహిస్తారట. అలాగే వీరు హౌస్ లోకి వెళ్లబోయే ముందు రెండు వరాలు నిర్వాహకుల పర్యవేక్షణలో ఉంచి, మళ్ళీ కరోనా టెస్టులు చేసి.. ఎవరికీ పాజిటివ్ లేదని నిర్ధారించుకున్న తరువాత హౌస్ లోకి పంపిస్తారని సమాచారం అందుతుంది. ఈ షో నిర్వహణా సిబ్బందికి కూడా కరోనా టెస్టులు నిర్వహిస్తారని సమాచారం.

తాజా వార్తలు