హీరో నితిన్ తన ప్రేయసి షాలిని ఎంగేజ్మెంట్ జరిగి చాలా కాలం అవుతుంది. ఏప్రిల్ నెలలో వీరిద్దరి పెళ్లి గ్రాండ్ గా జరగాల్సింది. కరోనా వైరస్ కారణంగా నితిన్ వివాహం వాయిదా వేశారు. అత్యంత వైభవంగా దుబాయిలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్న నితిన్ ఆశలన్నీ కూడా అడియాశలు అయ్యాయి. ఈ ఏడాది చివర్లో ముందుగా అనుకున్న ప్రకారమే డెస్టినేషన్ మ్యారేజ్ చేయాలనుకున్న ఇరు కుటుంబ సభ్యులు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది.
ప్రస్తుతం పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పట్లో పరిస్థితులు కుదుట పడే అవకాశం లేదని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయానికి వచ్చారు. అందుకే డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లానింగ్స్ ను క్యాన్సిల్ చేసుకున్నారట. వచ్చే నెలలో హైదరాబాద్ శివారులోని ఒక ఫామ్ హౌస్ లో నితిన్ షాలినిల వివాహంకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఆషాడ మాసం పూర్తి అయిన వెంటనే నితిన్ షాలినిల వివాహంకు ముహూర్తం ఫిక్స్ చేశారట. త్వరలోనే ఆ వివాహ తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.