“ప్రభాస్ 21” లో ఈ హీరోయిన్ కీలక రోల్ నిజమేనా?

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో మొత్తం మూడు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే వాటిలో ఒక్కోదాని తర్వాత ఒక్కోటి వరుసలో ఉన్నట్టుగానే వాటిపై అంచనాలు నెలకొన్నాయి. లేటెస్ట్ “రాధే శ్యామ్” పై మంచి అంచనాలు ఉన్నా తర్వాత నాగశ్విన్ తో తీయనున్న 21 వ చిత్రంపై మరిన్ని అంచనాలు ఆ తర్వాత తీయనున్న బై లాంగువల్ చిత్రం “ఆదిపురుష్” పై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ప్రభాస్ అభిమానులు అత్యధికంగా ఎదురు చూస్తుంది మాత్రం నాగశ్విన్ తో సినిమా కోసమే అని చెప్పాలి.

ఎందుకో వారు ఈ ప్రాజెక్ట్ అంటేనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. మన టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో తన టాలెంట్ తో మంచి సినిమాలు చేస్తున్న హీరోయిన్ నివేతా థామస్ ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర పోషించనున్నట్టు టాక్. నాగశ్విన్ ఆ కీ రోల్ కు ఈమె పేరునే పరిశీలనలో ఉంచినట్టు టాక్ వినిపిస్తుంది. మరి ఈ హీరోయిన్ ఈ గ్రేట్ ప్రాజెక్ట్ లో కనిపించనుందా లేదా అన్నది తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

Exit mobile version