పవన్ సినిమాపై కొనసాగుతున్న సస్పెన్స్.!


ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అధికారికంగా మూడు ప్రాజెక్టులకు కమిట్ అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈ మూడు చిత్రాలు అనంతరం పవన్ చేయబోయే సినిమా విషయంలో మాత్రం చాలా రోజుల నుంచి కొంత సస్పెన్సు అలా కొనసాగుతుంది. ఆ మూడు చిత్రాల తర్వాత పవన్ ఏ దర్శకునితో చేస్తారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

అయితే ఆ రేస్ లో ఉన్న దర్శకుల జాబితాలో స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి పేరు ఇంకా వినిపిస్తూనే ఉంది. అయితే సురేందర్ రెడ్డి ఇప్పుడు అక్కినేని అఖిల్ తో కూడా ఒక ప్రాజెక్ట్ చేయనున్నారు. అలాగే పవన్ తో ప్రాజెక్ట్ కు కూడా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్టు టాక్ వినిపిస్తుంది. మరి పవన్ ఏ డైరెక్టర్ తో తన 29 వ సినిమాను చేస్తారో చూడాలి. ప్రస్తుతం పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ వచ్చే డిసెంబర్ లో మొదలు కానుండగా దాని తర్వాత వెంటనే క్రిష్ చిత్రంలో పాల్గొననున్నట్టు తెలుస్తుంది.

Exit mobile version