హీరోయిన్ గా కెరీర్ ఆరంభించిన అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ తెచ్చుకున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో పూజా హెగ్డే కూడా ఒకరు. ఇప్పటికే మన తెలుగులో దాదాపు అందరి స్టార్ హీరోలతోనూ నటించేసిన ఈ హీరోయిన్ కు బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది.
అక్కడి స్టార్ హీరో హృతిక్ రోషన్ తో ఇప్పటికే “మొహంజదారో” అనే చిత్రంలో నటించి అక్కడి ప్రేక్షకులకు దగ్గరయింది. అలా ఇప్పుడు ఈ హీరోయిన్ బాలీవుడ్ లో మరో భారీ ప్రాజెక్ట్ లో నటించనున్నట్టు ఇప్పుడు సమాచారం. ప్రస్తుతానికి యిఉంజి రెబల్ స్టార్ ప్రభాస్ తో నటిస్తున్న “రాధే శ్యామ్”తో మళ్ళీ బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుండగా..
తర్వాత బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో నటించనున్నట్టు తెలుస్తుంది. అలాగే అక్కడి మరో స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో కూడా ఓ సినిమాలో ఫిమేల్ లీడ్ కు పూజా పేరునే అనుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ చిత్రాన్ని ఫర్హద్ సంజీ దర్శకత్వం వహిస్తుండగా అక్షయ్ మన దక్షిణ భారతానికి చెందిన వ్యక్తిగా కనిపించనున్నాడట. మొత్తానికి మాత్రం పూజా బాలీవుడ్ లో కూడా నిలదొక్కుకునేలా ఉందని చెప్పాలి.