మన టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ హీరోలు అంతా తమ పెళ్లి వార్తలు తెలిపి తమ ఫ్యాన్స్ కు ఒక తీపి కబురును అందజేశారు. వారిలో యూత్ స్టార్ నితిన్ కూడా ఒకరు, గత కొన్నాళ్ల కితమే తనకి కాబోయే భాగస్వామిని పరిచయం చేశారు.
అయితే ఎప్పుడో ఎంతో ఘనంగా జరగాల్సిన వీరి పెళ్లి ఇప్పుడు పరిస్థితులు చక్కబడకపోవడంతో ఇక్కడ హైదరాబాద్ లోనే సింపుల్ గానే ప్లాన్ చేసేసారు. ఇప్పటికే అనేక మంది అగ్రులను ఆహ్వానించిన నితిన్ వివాహానికి మరో స్పెషల్ గెస్ట్ అటెండ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
ఆయన మరెవరో కాదు, నితిన్ ఎంతగానో ఆరాధించే హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ జూలై 26 న జరగనున్న నితిన్ వివాహానికి పవన్ కూడా హాజరు కానున్నారని ఇప్పుడు సమాచారం. లాక్ డౌన్ విధించినప్పటి నుంచీ పవన్ బయటకొచ్చి కనిపించిన దాఖలాలు లేవు. మరి ఇలాగైన పవన్ కనిపిస్తారో లేదో చూడాలి.