రౌడీ హీరోతో ఆ రోల్ చేయనంటున్న సీనియర్ హీరోయిన్.!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ప్రత్యేకంగా యూత్ లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. హీరోగా తాను నటించిన లేటెస్ట్ సినిమాలు ఫలితంతో సంబంధం లేకుండా మెయిన్ అట్రాక్షన్ గా నిలుస్తాడు. అలాగే అది మాత్రమే కాకుండా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఈ రౌడీ హీరోకు గట్టిగానే ఉంది. అయితే ఈ యంగ్ హీరోతో ఓ సీనియర్ హీరోయిన్ మాత్రం ఒక రోల్ కు నో ఛాన్స్ అని చెప్తుంది.

తమిళ్ లో కమల్ కు కూతురిగా “ఇండియన్”, తెలుగులో “నిప్పురవ్వ”, “అన్నమయ్య” లాంటి ఎన్నో చిత్రాల్లో నటించిన సీనియర్ హీరోయిన్ కస్తూరీ ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే ప్రోగ్రాం “ఆలీతో సరదాగా”లో పాల్గొన్నారు. అలా ఎన్నో విషయాలను పంచుకున్న ఈమె ఆలీ ఓ ప్రశ్న అడగ్గా విజయ్ కు తల్లిగా రోల్ చెయ్యమంటే మాత్రం అసలు చెయ్యనని చెప్పేసింది.

ఎందుకంటే విజయ్ అంటే తనకి క్రష్ అని అతను ఒక ఇటాలియన్ మోడల్ లా ఉంటాడని చెప్పారు. కోలీవుడ్ లో పలు కాంట్రవర్సీలలో ఎప్పటికప్పుడు వైరల్ అయ్యే ఈ సీనియర్ నటి ఇప్పుడు తెలుగులో స్టార్ మా ఛానెల్లో ప్రసారం అయ్యే “గృహ లక్ష్మి” సీరియల్ లో నటిస్తున్నారు.

Exit mobile version