ఆ హీరోయిన్ ఇక పెళ్లి చేసుకోదట

హీరోయిన్ సితార తెలియనివారుండరు. దశాబ్దాలుగా ఆమె వెండితెరపై అనేక రకాల రోల్స్ చేస్తూ వస్తున్నారు. 80లలో వెండితెరకు పరిచయమైన సితార కెరీర్ బిగినింగ్ లో హీరోయిన్ గా కూడా చేసింది. ప్రస్తుతం ఈమె అనేక సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. ఐతే సితార ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఆమె వయసు ప్రస్తుతం 47సంవత్సరాలు. ఇంకా ఆమెకి పెళ్లి కాలేదు అన్న విషయం ఎవరికీ తెలియదు.

ఐతే ఆమె ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనేది తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు… ‘పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉన్నా అదిజరగలేదు. దానికి ప్రత్యేక కారణమంటూ లేదు. నాన్న చనిపోయిన తర్వాత చాలా ఒంటరిగా ఫీల్ అయ్యాను. రెండు మూడేళ్లు సినిమాలు చేయలేదు. తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యాను. కానీ.. పెళ్ళైతే బాగుంటుందని తెలుసు, కానీ చేసుకోను’ అని చెప్పుకొచ్చింది.

Exit mobile version