1977లో నందమూరి తారక రామారావు నటించిన యమలీల సోషియో ఫాంటసీ చిత్రాలతో ఓ ట్రెండ్ సెట్టింగ్ మూవీ. తాతినేని రామ రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అనుకుంది. చనిపోయిన ఎన్టీఆర్ యమలోకంలో యముణ్ణి ముప్పతిప్పలు పెట్టే సన్నివేశాలు నాటి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాయి. యముడి పాత్రలకు కైకాల సత్యనారాయణ బ్రాండ్ గా మారింది ఈ చిత్రంతోనే అనాలి. ఇక చిత్ర గుప్తుడు పాత్రలో అల్లు రామలింగయ్య నటన ఎప్పటికీ మరవలేనిది. ఈ మూవీ తరువాత తెలుగులో అనేక చిత్రాలు ఈ కాన్సెప్ట్ తో రాగా చిరంజీవి యముడికి మొగుడు, మోహన్ బాబు యమజాతకుడు చిత్రాలు చేశారు. ఈ రెండు చిత్రాలు కూడా భారీ విజయాన్ని అనుకున్నాయి.
కాగా 2007లో జూనియర్ ఎన్టీఆర్ తాత వారసత్వాన్ని కొనసాగిస్తూ యమదొంగ పేరుతో భూలోకం మరియు యమలోకం కాన్సెప్ట్ తో మూవీ చేయడం జరిగింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ భారీ విజయం అందుకుంది. మోహన్ బాబు యముడి రోల్ చేయగా, బ్రహ్మనందం చిత్ర గుప్తుడు పాత్ర చేయడం జరిగింది. ఇక మోహన్ బాబు పదవిని లాగేసుకొని ఆయన్ని ముప్పతిప్పలు పెట్టే యంగ్ యముడిగా ఎన్టీఆర్ నటన మరచిపోలేము. కాగా యమలోకం కాన్సెప్ట్ తో వచ్చిన చిత్రాలలో హీరోలుగా నటించిన తాతామనవళ్లుగా, సీనియర్ ఎన్టీఆర్ మరియు జూనియర్ ఎన్టీఆర్ రికార్డు సృష్టించారు.